అప్పుడే టీడీపీ – జ‌న‌సేన – బీజేపీ పొత్తా… క్లారిటీ ఇచ్చారుగా…!

-

రాజకీయాల్లో ఎప్పుడు ఏం ? జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్నవారు రేపు శత్రువులు అవుతారు. నిన్న శత్రువులుగా ఉన్న వారు రేపు చేతులు కలిపి ఒకటవుతారు. ఒకే పార్టీలో ఉన్న నేతలు శత్రువులుగా ఉంటే… వేరే పార్టీలో ఉన్న నేతలు మిత్రులుగా ఉన్న సందర్భాలు కూడా ఇక్కడ కామ‌న్‌. తాజాగా ఏపీ రాజకీయాల్లో టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మూడు పార్టీలు ఏకమై అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు చేతులు కలపనున్నాయా ? ఏపీలో 2022 లో జ‌మిలీ ఎన్నికలు జరిగినా… లేదా 2024లో ఎన్నికలు జరిగిన బద్ధ శత్రువులైన ఈ పార్టీలన్నీ ఒక్కటై వైసీపీని ఓడించేందుకు పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తాయా ? అన్న డౌట్లు ఇప్ప‌టికే ఉన్నాయి.

TDP, BJP, Janasena with a single agenda
TDP, BJP, Janasena with a single agenda

ఇక తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా అయ్య‌న్న‌ చేసిన వ్యాఖ్యలను బ‌ల‌ప‌రిచేలా ఉన్నాయి. మూడు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు వేర్వేరుగా పోటీ చేసి వైసీపీ చేతిలో ఘోరంగా దెబ్బతిన్నాయి. వైసీపీ రికార్డులు క్రియేట్ చేస్తూ ఏకంగా 151 సీట్లతో తిరుగు లేని రీతిలో అధికారం సొంతం చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో వైసిపి బలమైన శక్తిగా ఉంది. వైసీపీని ఓడించ‌డం టీడీపీకి, బిజెపి, జనసేనకు సాధ్యమయ్యే పని కాదని చర్చలు కూడా నడుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ ఓడించాయి.

మరోసారి ఈ మూడు పార్టీలు జతకడితే తప్ప వైసీపీని ఓడించాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చే అన్న సందేహాలు ఉన్నాయి తాజాగా ఆయన కూడా ఈ సందేహాలకు బలం వ‌చ్చేలా మాట్లాడారు. 2024 ఎన్నిక‌ల్లో టీడీపీ బీజేపీ, జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేస్తుంద‌ని మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు జోస్యం చెప్పాడు. త్వ‌ర‌లో దేశం అంతటా వ‌చ్చే జమిలీ ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తాయ‌ని ఆయ‌న తెలిపారు. ఈ మూడు పార్టీల కూట‌మి వైసీపీని ఓడిస్తుంద‌ని అయ్య‌న్న చెప్ప‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. ఇప్ప‌టికే ఈ మూడు పార్టీల నేత‌లు వేర్వేరుగా వైసీపీని టార్గెట్‌గా చేసుకుంటున్నాయి.

ప‌వ‌న్ చేస్తోన్న వ్యాఖ్య‌లు ప‌రోక్షంగా బాబుకు ల‌బ్ధి క‌లిగేలా క‌నిపిస్తున్నాయి. రాజ‌ధానిని అక్క‌డ నుంచి త‌రిమేస్తే తాను పోరాటం చేస్తాన‌ని ప‌వ‌న్ చెపుతున్నారు. బీజేపీ నేత‌ల మాట‌లు కూడా అలాగే ఉన్నాయి. రాజ‌ధానిని అమ‌రావ‌తి నుంచి త‌ర‌లించ‌డం క‌రెక్ట్ కాద‌ని చెపుతున్నారు. ఇటీవ‌ల న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో చేరింది కూడా టీడీపీని కాపాడి, రాబోవు ఎన్నిక‌లో పొత్తులు కుదిర్చేందుకే అనే అప‌వాదు ఉంది. ఈ నేప‌థ్యంలో అయ్య‌న్న పాత్రుడు చేసిన వ్యాఖ్య‌లు చూస్తుంటే ఈ మూడు పార్టీలో నేడు కాక‌పోయినా… రేపు అయినా కల‌వ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news