హవ్వ..! ర్యాంకుల విషయంలోనూ కులాల రాజకీయమా..?

-

ఇటీవల ఏపీలో నిర్వహించిన సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్ లీకైందని ఓ ప్రముఖ పత్రిక వార్తలు రాయడం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందేఅయితే ఇప్పుడు ఆ వివాదం కొత్త మలుపులు తిరుగుతోందిఉద్యోగార్ధుల సమస్య విషయంలోనూ రాజకీయ పార్టీలు కులాల కుంపటి రాజేస్తున్నాయిఈ ఉద్యోగ పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించిన అనిత.. ఏపీపీఎస్సీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారని ఆ పత్రిక రాసింది.

ఆ పేపర్ టైప్ చేసింది కూడా ఆమేనని తానే చూసినట్టు రాసుకొచ్చిందిఅప్పటి నుంచి రాజకీయ రగడ మొదలైందిఅనితమ్మతో పాటు మరికొందరు ర్యాంకర్లు కూడా రెడ్డిలే అంటూ టీడీపీ నేతలు కులాల రాజకీయం మొదలు పెట్టారుసోషల్ మీడియాలో ఈ ప్రచారం జోరుగా సాగుతోందిదీనికి సమాధానం చెప్పాల్సిన వైసీపీ కూడా అదే కార్డుతో పోరాడుతోంది.

బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో మొదటి ర్యాంక్‌ వస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు,ఎబిఎన్ ,ఆంద్రజజ్యోతి రాధాకృష్ణ తట్టుకోలేకపోతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారుగ్రామ సచివాలయ ఉద్యోగాల పేరుతో ఒకేసారి లక్షా 27 వేల పోస్టులు భర్తీ చేయడం ఒక చరిత్ర అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పేర్కొన్నారు.

రాష్ట్రంలో బీసీలను అణగదొక్కాలని వాళ్లిద్దరూ కంకణం కట్టుకున్నారని అందుకే బీసీ నేతలను బాడుగ నేతలుగా రాధాకృష్ణ తన పేపర్‌తో పాటు చానెల్‌లో బహిరంగంగానే అభివర్ణించారని వైసీపీ నేతలు మండిపడుతున్నారురాష్ట్రంలో చంద్రబాబు తప్ప మరొకరు సీఎం కాకూడదనేది ఆ పత్రికాధిపతి ఉద్దేశమనిపత్రికను అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆగ్రహం వెళ్లగక్కారుకులాలుమతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఆ పత్రికాధిపతి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఇలా చివరకు పరీక్ష పత్రాల లీక్ వ్యవహారంర్యాంకుల వ్యవహారంలోనూ కులాల విషయాలు హైలెట్ చేయడం ఏపీ రాజకీయాలకు పరాకాష్టంగా చెప్పుకోవచ్చు.. దేనికైనా కులాన్ని పులిమేయగల ఘనులు మనవాళ్లను దీంతో రుజువైపోయందిఇంతకీ ఈ ఫస్ట్ ర్యాంకర్ అనిత బీసీనారెడ్డీనా అన్న అంశంపై క్లారిటీ ఇచ్చేదెవరో..?

Read more RELATED
Recommended to you

Latest news