నేడు కుప్పంకు టీడీపీ అధినేత చంద్రబాబు

నేడు కుప్పంకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆయన సొంత నియోజక వర్గం లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు చంద్రబాబు నాయుడు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం చేరుకోనున్నారు చంద్రబాబు నాయుడు. రెండు గంటలకు బస్టాండ్ వద్ద భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనున్నారు.

chandrababu naidu

రేపు సాయంత్రం వరకు కుప్పం అంతటా రోడ్ షో లు, నాయకుల ఇళ్లకు వెళ్లి పరామర్శలు చేయనున్నారు టిడిపి అధినేత. కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పర్యటన జరుగనుంది.

పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయిన కుప్పం మునిసిపాలిటీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యం లోనే చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన కుప్పం మునిసిపాలిటీ పరిధికే పరిమితం కానుంది. కుప్పం పంచాయితీ, ప్రాదేశిక పోరులో ఓటమి ఎదురయ్యాక తొలిసారిగా కుప్పం వస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇక అధినేత పర్యటన విజయవంతం చేసేందుకు తెలుగు తమ్ముళ్లు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు…