దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హౌజ్ అరెస్ట్..

-

రైతులు, వరిసాగుపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సిద్దిపేట కలెక్టర్ వెంట్రామిరెడ్ది ఉదంతం సెగలు రేపుతూనే ఉంది. ఈ వ్యాఖ్యలపై రైతుల నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా బీజేపీ నిరసన బాటను ఎంచుకుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపు నిచ్చింది. దీంతో సిద్దిపేట వ్యాప్తంగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును హౌజ్ అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి లోని ఆయన నివాసంలో నిర్బంధించారు. ఇదిలా ఉంటే ఖచ్చితంగా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం జరుగుతుందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. మరోవైపు సిద్ధిపేట జిల్లాలో బీజేపీ ప్రధాన నాయకులను, కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వరిసాగుకు వ్యతిరేఖంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇటీవల వ్యవసాయ అధికారులు సమావేశంలో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరి సీడ్ అమ్మే వాళ్ల షాపులను సీజ్ చేస్తానని, సుప్రీం కోర్ట్ నుంచి అనుమతి తెచ్చుకున్నా వదిలేదని, రైతులు యాసంగిలో వరిసాగు చేయకూడదంటూ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమయ్యాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.

Read more RELATED
Recommended to you

Latest news