టీడీపీలో పదవుల పందేరం ఆనేతల్లో అసంతృప్తికి దారితీసిందా?

-

టీడీపీ నేతలు మళ్లీ పక్క చూపులు చూస్తున్నారా? ఇప్పటికే అధికార పార్టీతో టచ్‌లోకి వెళ్లినవారిని అందలం ఎక్కించడంపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో ఉన్నారా? ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీని ఇంకా ప్రకటించకపోయినా.. కేంద్ర కమిటీలో చోటు దక్కని నేతలు ఒక్కొక్కరుగా అసంతృప్తి బయట పెడుతున్నారు.

విజయనగరం జిల్లా నుంచి అశోక్‌గజపతిరాజుకు మళ్లీ పొలిట్‌బ్యూరోలో స్థానం దక్కగా.. కొత్తగా గుమ్మడి సంధ్యారాణికి అవకాశం కల్పించారు. జిల్లాలో సీనియర్‌ నాయకులు, మంత్రులుగా పనిచేసిన వారు చాలామంది ఉన్నా.. వారెవరినీ పరిగణనలోకి తీసుకోలేదు చంద్రబాబు. కిమిడి మృణాళిని, సుజయ కృష్ణ రంగారావు, పతివాడ నారాయణస్వామి, శత్రుచర్ల విజయరామరాజు ఇలా చాలా మంది సీనియర్లు ఉన్నా ఎవరినీ చంద్రబాబు లెక్కల్లోకి తీసుకోకపోవడం పార్టీ నేతలను ఆశ్చర్యపరిచిందట.

ఈ జాబితాలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పీతల సుజాత ముందు వరుసలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో చింతలపూడి టికెట్‌ లభించక.. ఇప్పుడు పార్టీ కమిటీలో చొటుదక్కపోవడంతో తనను మర్చిపోయారనే అభిప్రాయంలో ఉన్నారట. టీడీపీకి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

చిత్తూరు జిల్లాలో పార్టీ నుంచి వెళ్లిపోతారని ప్రచారంలో ఉన్నవారిని పిలిచి పదవులు ఇవ్వడంపై తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారట. గల్లా అరుణకుమారి, డికే సత్యప్రభలను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు చంద్రబాబు. గల్లా అరుణ పార్టీకి అంటీముట్టనట్టు ఉంటున్నారు. వయోభారంతో యాక్టివ్‌గా పాల్గొనడం లేదు. అదే కారణంతో ఆమె తన పొలిట్‌బ్యూరో పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు కూడా. అలాంటి అరుణకు మళ్లీ పదవి ఇచ్చి పెద్దపీట వేశారు. ఇటీవల తిరుమల వచ్చిన సీఎం జగన్‌తో డీకే సత్యప్రభ కుమారుడు డీకే శ్రీనివాస్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. డీకే కుటుంబం టీడీపీని వీడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news