తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని అని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసు కుంది. బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో… సుదీర్ఘ చర్చలు జరిపిన… టిడిపి బాస్ చంద్రబాబు నాయుడు… బద్వేలు ఉప ఎన్నికకు తప్పు కోవాలని నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని… మరికొంత మంది నేతలు పోటీ చేయ వద్దని… చంద్రబాబు ముందు విన్నవించారు.
వారి వాదనలు విన్న చంద్రబాబు నాయుడు… చివరికి బద్వేల్ నియోజక వర్గ ఉప ఎన్నిక కు … దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే భార్యకే అధికార వైసిపి పార్టీ టికెట్ ఇచ్చిన అందుకే.. పోటీకి దూరంగా ఉన్నట్లు స్పష్టం చేసింది తెలుగుదేశం పార్టీ. కాగా ఇప్పటికే జనసేన పార్టీ పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించగా… భారతీయ జనతా పార్టీ మాత్రం… పోటీ చేసి తీరుతామని పేర్కొంది.