నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మహానటి అంటూ టీడీపీ మహిళా సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. అమరావతి రైతులు ఆమెను అడ్డుకోవడంపై స్పందించిన నన్నపనేని సంచలన వ్యాఖ్యలు చేసారు. జబర్దస్త్‌లో రోజా మహానటని ఎద్దేవా చేసిన ఆమె నిజజీవితంలోనూ చాలా అద్భుతంగా నటిస్తోందంటూ ఆరోపించారు. జై అమరావతి అనాలని రైతులు అడ్డుకుంటే, రోజా డీజీపీకి ఫోన్ చేసిందనని మండిపడ్డారు ఆమె.
అసలు జై అమరావతి అనడానికి రోజాకి వచ్చిన ఇబ్బందేంటని ఆమె ప్రశ్నించారు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న భూములను ఎలా సర్వే చేస్తారని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. సర్వేను అడ్డుకున్నందుకుక 426 మంది రైతులపై కేసులు పెట్టారన్నారని ఆరోపించిన ఆమె, కేసులు పెట్టాల్సింది రైతులపై కాదు, దొంగదారిన వస్తున్న అధికారులపై పెట్టాలని సవాల్ చేసారు నన్నపనేని. గ్రామాల్లోకి రెవెన్యూ అధికారులు వస్తే ఏ సంతకాలూ చేయొద్దని సూచించారు.
కాగా నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్‌లో పాల్గొనడానికి ఆర్కే రోజా రాగా అక్కడ రైతులు ఆమెను అడ్డుకున్నారు. విశ్వవిద్యాలయం చుట్టూ ముట్టడించి ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని డిమాండ్ చేసారు. దీనితో చేసేది లేక పోలీసులు ఆమెను అక్కడి నుంచి పంపించారు. జాగ్రత్తగా ఆమెను అక్కడి నుంచి తరలించారు. ఆమె వెళ్తున్న దారి పొడవునా రైతులు ఆమెను అడ్డుకుంటూనే ఉన్నారు. అమరావతికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేసారు.