జిల్లాల టీడీపీ నేతలతో లోకేశ్ భేటీ… కార్యాచరణపై చర్చ

-

రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో వివిధ జిల్లాలకు చెందిన పార్టీ నేతలు భేటీ అయ్యారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం లోకేశ్ రాజమండ్రిలోనే ఉండి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసుల అంశంతో పాటు, అరెస్టుపై టీడీపీ చేపట్టిన నిరసనలపై పార్టీ నేతలతో లోకేశ్ ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు ధర్నా చౌక్ లో కూడా అనుమతించకపోవడం జగన్ నియంత పోకడలకు అద్దం పడుతోందని నారా లోకేశ్ అన్నారు. నిరాహార దీక్ష చేసిన వారిపై కూడా హత్యాయత్నం కేసు పెట్టి రిమాండ్ కు పంపిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని విమర్శించారు. ఇవన్నీ ప్రభుత్వ బలహీనతను, జగన్ భయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు.

Watch: Nara Lokesh Effortlessly Addresses the National Media

ఇది ఇలా ఉంటె, సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్లీ ఏపీ రాజకీయాల్లో వార్తల్లో వ్యక్తిగా మారారు. నారా లోకేష్ కి ఫోన్ చేసిన ఆయన ధైర్యం చెప్పారు. తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకి రక్షగా నిలుస్తుందన్నారు రజినీకాంత్. ఇలాంటి సమయంలో లోకేష్ ధైర్యంతో ఉండాలని సూచించారు. తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని అన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన కచ్చితంగా బయటకు వస్తారని ధీమా వ్యక్తంచేశారు. నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్ ధైర్యంగా ఉండాలని సూచించారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, ఆయన చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news