టీడీపీ కీలక నిర్ణయం… రేపటి నుండి రాష్ట్రవ్యాప్తంగా “బాబుతో నేను” !

ఆంధ్రప్రదేశ్ లో అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ను స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రభుత్వ డబ్బును దారి మళ్లించారన్న విషయంలో అరెస్ట్ చేసిన నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నేతలు అంతా దిక్కు తోచని అయోమయస్థితిలో పడిపోయారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం టీడీపీని నమ్ముకున్న ప్రజలకు దైర్యంగా మరియు చంద్రబాబుకు మద్దతుగా మేమున్నాం అంటూ రేపటి నుండి రాష్ట్రము అంతటా “బాబుతో నేను” పేరుతో ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం కోసం ముందుగా లోగోను కాసేపటి క్రితమే ఆవిష్కరించింది. రాష్ట్రము మొత్తం రేపటి నుండి మండల, నియోజకవర్గ స్థాయిల వారీగా నేతలు అంతా రిలే నిర్వహ దీక్షలు చేయనున్నారు. అంతే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రభుత్వం అన్యాయంగా చంద్రబాబు ను అరెస్ట్ చేసిన విధానాలను అందరికీ వివరించనున్నారు.

ఇక టీడీపీ నేతలు చేయనున్న ఈ కార్యక్రమాలకి సరైన స్పందన వస్తుందా ? ఇది ఎన్నికలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది చూడాలి.