గిల గిల గిల కొట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్ళు !

-

తెలుగుదేశం పార్టీ పరిస్థితి మట్టానికి కూరుకుపోయి ఉంది. ఎంత లేపుదామని ప్రయత్నించినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మాత్రం అంతగా నమ్మకం పెట్టుకోవడం లేదు. 2019 ఎన్నికల దెబ్బకు చంద్రబాబుకి దాదాపు రిటైర్మెంట్ ఏపీ ప్రజలే ముందు ప్రకటించడం జరిగిందని, ఆ విధమైన తీర్పు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అప్పట్లో కామెంట్లు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న క్రమంలో కొద్దో గొప్పో పార్టీని పైకి తీసుకు రావాలనే టీడీపీ తమ్ముళ్లు చేస్తున్న ప్రయత్నాలు గిల గిల గిల కొట్టుకుంటూనట్లు ఉంది.Image result for chandrababu trumpజాకీ పెట్టి లారీ టైర్ నీ లేపినటు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు చంద్రబాబు ని ఓ రేంజ్ లో మీడియా ముందు ప్రాజెక్ట్ చేసే ప్రయత్నాలు చేసి సోషల్ మీడియాలో నవ్వులపాలు అవుతున్నారు. విషయంలోకి వెళితే ఇటీవల అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన చేపట్టడం జరిగింది. పర్యటనలో భాగంగా డోనాల్డ్ ట్రంప్ దేశంలో మూడు రాష్ట్రాలను సందర్శించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాలలో డోనాల్డ్ ట్రంప్ పర్యటించడం జరిగింది.

 

ఈ సందర్భంగా ట్రంపు పర్యటన అడ్డంపెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు రాష్ట్రంలో అధికారంలో ఉంటే డోనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా ఏపీలో పర్యటించే వారని మాట్లాడుతూ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు అసలు డోనాల్డ్ ట్రంప్ పర్యటన ఐదు నెలల ముందే ఖరారు అయిపోద్ది, దానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఎటువంటి సంబంధం ఉంటుంది. మీరు భలే పొగుడుతున్నారు, కంగారు పడకండి స్థానిక ఎన్నికల్లో కూడా 2019 దే రిపీట్ అవుతుందని స్థానిక ఎన్నికల గురించి వార్నింగ్ టైపులో సెటైర్లు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news