ఊహించని నిర్ణయం తీసుకున్న జగన్, ఇప్పుడు బాబు పరిస్థితి ఏంటీ…?

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్దమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చంద్రబాబు ఒక పక్క ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయినా జగన్ మాత్రం ఈ విషయంలో దూకుడుగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ మనుగడే కష్టమని టీడీపీ ప్రచారం చేస్తున్న తరుణంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం దెబ్బకు చంద్రబాబుకి మైండ్ బ్లాక్ అయిందని రాజకీయ పరిశీలకులు సైతం వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

టీడీపీ కార్యకర్తలు కూడా జగన్ ఈ నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు. చంద్రబాబు కూడా ఈ నిర్ణయాన్ని అసలు అంచనా వేయలేకపోయారు అనేది అర్ధమవుతుంది. బీసి రిజర్వేషన్ విషయంలో సుప్రీం కోర్ట్ కి జగన్ వెళ్ళే అవకాశం ఉందని అనుకున్నారు. కాని జగన్ అనూహ్యంగా రిజర్వేషన్ తగ్గించి ఎన్నికలకు వెళ్ళాలి అని సిద్దమయ్యారు. అదే విధంగా రిజర్వేషన్ తగ్గింపు పై నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి సిద్దమయ్యారు ఆయన.

అందుకే చంద్రబాబు హడావుడి జగన్ కి లేఖ రాస్తూ సుప్రీం కోర్ట్ లో స్పెషల్ లీవ్ పిటీషన్ వెయ్యాలని ఒక సలహా ఇచ్చారు. ఇక్కడ జగన్ ని బూచిగా చూపించాలాని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే జగన్ మాత్రం వెనక్కు తగ్గే అవకాశాలు కనపడటం లేదు. కేబినేట్ సమావేశంలో కూడా దీనిపై చర్చ జరిగింది. రాజకీయంగా ఇప్పుడు చంద్రబాబు చాలా బలహీనంగా ఉన్నారు.

సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. చాలా వరకు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు స్వాగతిస్తున్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నాయని అయినా జగన్ అమలు చేస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది. దీనితో గ్రామ స్థాయిలో ఆ పార్టీ బలంగా ఉంది. దీనితో టీడీపీ కి ఈ ఎన్నికల్లో కూడా షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం చంద్రబాబు బలహీనపడటం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news