లాక్డౌన్ వల్ల మనుషుల్లో ప్రేమలు పెరిగాయా? సర్వేలు ఏం చెబుతున్నాయి?

-

కరోనా వచ్చి ప్రపంచాన్నే అతలాకుతలం చేసేసింది. అప్పటి వరకూ వేగంగా పరుగెడుతున్న ప్రపంచాన్ని కదలడానికి భయపాడేలా చేసింది. లాక్డౌన్ వల్ల బయట తిరగలేకపోవడంతో ఇంట్లోనే ఉండి తమని తాము విశ్లేషించుకునేలా చేసింది. కరోనా లాక్డౌన్ వల్ల మనుషులు మారారా అనే సందేహం వస్తే మారి ఉండవచ్చనే అనిపిస్తుంది. అవును, లాక్డౌన్ వల్ల ఎవ్వర్నీ కలవకపోవడంతో ఎలా తయారయ్యారో గమనించుకున్నాం. ఒకరికి ఒకరు తోడుగా నిలబడకపోతే ఏమవుతుందనే విషయాలు తెలుసుకున్నాం.

కరోనా కారణంగా చనిపోతే కనీసం ముట్టుకోవడానికి కూడా వీలు లేకుండా అయిపోయిన పరిస్థితిని చూసి బాధలు పడ్డాం. రేపు పొద్దున్న మన పరిస్థితి కూడా ఇంతే కదా అన్న భావన కలిగి మన మీదే మనకే ఒకరకమైన భావన కలిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో అందరికీ అర్థమైన ఒకే ఒక్క విషయం ఏంటంటే, జీవితం చాలా చిన్నదని. అవును, ఎప్పుడు ఏం అవుతుందో తెలియని ప్రపంచంలో ఉరుకులు పరుగులు ప్రారంభించి చివరికి ఏం సాధించామా అన్న ఆలోచనకి వచ్చేసరికి, ఇంతేనా అన్న ఆలోచన కలిగి బాధపడడమే అవుతుంది.

లాక్డౌన్ వల్ల జీవితం అంటే ఏంటో తెలిసొచ్చింది. ఎదుటివారికి సాయపడాలన్న కోరిక కలిగింది. ఒంటరిగా వెళ్లేవాళ్ళని బాగున్నావా అని అడిగితే అంతే చాలు, అదే వాళ్ళని ఇంకా చాలా దూరం నడిపిస్తుందన్న నమ్మకం కలిగించింది. ముఖ్యంగా ఆనందం ముఖ్యమని తెలిసొచ్చింది. ఐతే దీనికి రివర్స్ లో కూడా కొన్ని జరిగాయి. లాక్డౌన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. పలకరించే వాళ్ళు లేక, ఇంట్లో ఉండలేక నరకం అనుభవించారు. అనవసర భయాలు ప్రేమని మరింత దూరం చేసాయి కూడా.

ఒక విషయంలో దేన్ని తీసుకోవాలనేది వాళ్ళ మీదే ఆధార పడి ఉంటుంది. చాలా మంది మనుషుల మీద ఇష్టం పెంచుకుంటే, కొంత మంది మాత్రం అయిష్టాన్ని పెంచుకున్నారు. దానికి కారణం కూడా మనుషులే.

Read more RELATED
Recommended to you

Latest news