పల్నాడు జిల్లాలో కాల్పులు.. టీడీపీ మండలాధ్యక్షుడికి గాయాలు

-

ఏపీలోని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు చోటుచేసుకున్నాయి. టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడి పారిపోయారు.

గాయాలపాలైన బాలకోటిరెడ్డిని కుటుంబసభ్యులు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. బాధితుడిని తెలుగుదేశం పార్టీ నేత చదలవాడ అరవిందబాబు ఆసుపత్రిలో పరామర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news