అనంతలో రచ్చ: వైసీపీ వర్సెస్ టీడీపీ..తన్నులాట..కారణం ఇదే.!

-

ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో అధికార వైసీపీ-ప్రతిపక్ష టి‌డి‌పి శ్రేణుల మధ్య గొడవ జరిగింది. గొడవ కాస్త కొట్టుకునే వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు రాళ్ళు, చెప్పులు విసురుకున్నారు. ఈ గొడవలో పలువురికి గాయాలు అయ్యాయి. అయితే ఒక వైసీపీ కార్యకర్త విసిరిన సవాల్ వల్ల రాప్తాడులో రచ్చ జరిగింది. గత కొన్ని రోజుల క్రితం రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే వల్ల రాప్తాడుకు రావాల్సిన జాకీ పరిశ్రమ తరలివెళ్లిపోయిందని, కమిషన్ అడగడంతోనే ఆ సంస్థ తెలంగాణకు వెళ్లిపోయిందని టి‌డి‌పి శ్రేణులు, టి‌డి‌పి నేత పరిటాల శ్రీరామ్ రామ్ ఆరోపించారు.

దీనిపై రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వివరణ ఇచ్చారు. గతంలో పరిటాల ఫ్యామిలీ జాకీ పరిశ్రమ కోసమని చెప్పి భూ దోపిడికి పాల్పడిందని ఆరోపించారు. అయితే ఇదంతా ఎప్పుడో జరిగింది. తాజాగా గుంటూరుకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త హరికృష్ణారెడ్డి.. పరిటాల కుటుంబాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

Anantapur

టీడీపీ కార్యాలయం, దేవాలయ భూముల్లో, జాకీ పరిశ్రమ నుంచి రూ.50 కోట్లు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. దీనికి పరిటాల అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇదే క్రమంలో వైసీపీ కార్యకర్త హరి.. అనంతపురం టవర్ క్లాక్ వద్దకు వస్తానంటూ సవాల్ విసిరారు. హరి సవాల్‌తో పరిటాల అభిమానులు, టీడీపీ కార్యకర్తలు టవర్ క్లాక్ వద్దకు చేరుకున్నారు. ఆ తరువాత హరికృష్ణారెడ్డి అక్కడి చేరుకోవడంతో గొడవ పెద్దది అయింది. ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్ళు విసురుకున్నారు. ఇలా రెండు వర్గాలు తీవ్ర స్థాయిలో దాడులకు దిగారు.

ఈ క్రమంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి టి‌డి‌పి, పరిటాల అభిమానులని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇలా అనంతపురంలో రచ్చ నడిచింది.

 

Read more RELATED
Recommended to you

Latest news