గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ లో 126 ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నోయిడా లోని గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులు ఖాళీగా వున్నాయి. సీనియర్‌ అసోసియేట్, జూనియర్‌ అసోసియేట్‌ వంటి ఖాళీలు దీనిలో వున్నాయి. ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ తదితర విభాగాల్లో ఈ పోస్టులు వున్నాయి.

వయసు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఇక అర్హత వివరాలని చూస్తే… సంబంధిత స్పెషలైజేషన్‌ లో ఇంజినీరింగ్‌ డిప్లొమా/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఎంబీఏ/ సీఏ/ సీఎంఏ లేదా తత్సమాన కోర్సు లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఈ పోస్టుల కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి వుంది. ఏప్రిల్‌ 10, 2023వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 10 నుంచి మొదలు అవుతాయి. అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.100లు అప్లికేషన్‌ ఫీజు కింద పే చెయ్యాల్సి వుంది. రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జూనియర్‌ అసోసియేట్ పోస్టులకు అయితే రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారట. పోస్టును బట్టి నెలకు రూ.40,000, రూ.60,000ల వరకు సాలరీ ని ఇస్తారు. వివరాలని అధికారిక నోటిఫికేషన్‌ లో చెక్‌ చూసుకోవచ్చు.

పూర్తి వివరాల కోసం: https://gailgas.com/careers/careers-in

 

Read more RELATED
Recommended to you

Latest news