ఎంత వెటకారం: జగన్ కుర్చీ బాబుకి కావాలంట!

-

ఉండొచ్చు కానీ… మరీ అంత యావ ఉండకూడదు అన్నట్లుగా… ఉదయం లేస్తే పదవి, నిద్రపోతే పదవి.. తింటున్నా అధికార యావే, పడుకున్నా అధికార యావే.. జనాలు ఏడుస్తున్నా పదవులే.. కరోనా వణికిస్తున్నా పదవులే.. అన్నట్లుంది ఏపీ టీడీపీ నాయకుల పరిస్థితి! కరోనా సమయంలో కూడా పొద్దున్న లేస్తే సమయం సందర్భం లేకుండా రాజకీయ విమర్శలు చేస్తున్నారని అధికారపక్షం నేతలు, జనాలు ఇంతకాలం టీడీపీ నేతలపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంక ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకున్నారో ఏమో కానీ… తమ మనసులో మాట ఏమిటో బయటపెట్టేశారు బోండా ఉమ!

వివరాళ్లోకి వెళ్తే… కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతీ రోజూ బోండా ఉమ మైకుల ముందుకొచ్చి రాజకీయోపాన్యాశాలు చేయడమే తప్ప.. ఎక్కడా చిన్నపాటి చేయుత అందించిన దాఖలాలు కనిపించలేదు! రోజూ ఏదో ఒక వంకన మైకు అందుకోవడం.. అర్ధం ఉన్నా లేకపోయినా అధికారపక్షాన్ని నాలుగు మాటలు అనేసి చల్లబడటం రోటీన్ గా సాగుతున్న వ్యవహారం. అయితే… ఇంతకాలం అధికారపక్షాన్ని ఒకలా తిట్టిన బోండా ఉమ… ఈ సారి ఏకంగా అధికారం తమ చేతికి ఇవ్వాలని నిస్సిగ్గుగ్గా అడిగేశారు!

175 అసెంబ్లీ స్థానలకుగానూ 23 స్థానాలు రావడం.. అందులో ప్రస్తుతం 21 మాత్రమే మిగిలాయని కథనాలు రావడంతో పరిస్థితి, భవిష్యత్తు కళ్లకు కట్టినట్లు కనిపించిందో ఏమో కానీ… మీ అస‌మ‌ర్థ‌త వ‌ల్ల ప్ర‌జ‌లు న‌ర‌కం చూస్తున్నారని అధికారపార్టీని విమర్శించిన బోండా ఉమ… “మీకు ప‌రిపాల‌న చేత‌కాకపోతే చంద్ర‌బాబుకి ప‌రిపాల‌న అప్ప‌గించాలని” డిమాండ్ చేసేస్తున్నారు! ప్రజాస్వామ్యంలో ఇంతటి నిస్సిగ్గు డిమాండ్ ఏమైనా ఉంటుందా? ప్రజలు మీ పరిపాలనకు విసుగు చెంది ఉన్నారు… మళ్లీ ఎన్నికలకు పోదాం, లేకపోతే రాబోయే స్థానిక ఎన్నికలను ప్రామాణికంగా తీసుకుందాం అనాలి! లేకపోతే… సీఎం రాజినామా చేయాలని, సంబందిత మంత్రి రాజినామా చేయాలని డిమాండ్ చేయాలి… అంతే కానీ… అధికారం మాకు ఇవ్వండని డిమాండ్ చేయడం ఏమిటో బోండా ఉమ రాజకీయానుభవానికి, ఆయన గురువు చంద్రబాబుకే తెలియాలి!

ఇది ప్రజా స్వామ్యమా లేక అధికార పీఠం అంటే… జగన్ – చంద్రబాబు / టీడీపీ – వైకాపా ఆడుకునే కుర్చీలాట? ఈ ఒక్క మాట చాలుకదా బోండా ఉమకు ప్రజాస్వామ్యానికి ఉన్న మీనింగ్ ఎంతవరకూ తెలుసో తెలుసుకోవడానికి! ఈ ఒక్క మాట చాలుకదా.. బోండా ఉమకు ప్రజాతీర్పుపై ఉన్న గౌరవాన్ని తెలియజేయడానికి! యావ ఉండొచ్చు కానీ మరీ ఇంత యావ ఉండకూడదు ఉమ? మరీ ఎక్కువగా కోరేసుకుంటే… లైఫ్ లో దక్కకుండా పోతుందేమో ఆలోచించుకోవాలి!! ప్రజాభిప్రాయాలను గౌరవించకుండా.. వారికిచ్చిన మాటలకు విలువ ఇవ్వకుండా గడిపినందుకే ప్రస్తుతం అనుభవిస్తున్న ఫలితం అని మరిచిపోకుండా మసులు కుంటే.. భవిష్యత్తు ఉంటుంది! అలాకాని పక్షంలో పార్టీలే కనుమరుగైపోయే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరికలతో కూడిన సూచనలు చేస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news