కోర్టు ధిక్కరణ కేసులో మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష

-

కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష విధించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మున్సిపల్ కమిషనర్‌గా పని చేసిన అంజన్ కుమార్‌కు రెండు నెలలపాటు జైలు శిక్ష విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ నుంచి కరెంట్ ఆఫీస్ వరకు ఉన్న మెయిన్ రోడ్డుపై ఆక్రమణలు పెరిగాయి. ఈ మేరకు అక్రమ నిర్మాణాలను తొలగించాలని పట్టణానికి చెందిన పెండెకట్ల యాకయ్య కోర్టును ఆశ్రయించాడు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆర్ అండ్ బీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

జైలు శిక్ష
జైలు శిక్ష

హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ మున్సిపల్ కమిషనర్ అంజన్ కుమార్ నిర్లక్ష్యం వహించాడు. దీంతో పెండేకంటి యాకయ్య మరోసారి హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు స్పందించిన హైకోర్టు మరోమారు విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు అంజన్ కుమార్‌పై చర్యలు తీసుకుంది. రెండు నెలలపాటు జైలు శిక్షను విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news