అలసిపోతే ఐపియల్ ఆడకు కోహ్లీ…!

-

ఏ మాటకి ఆ మాట గాని క్రికెటర్లకు ఐపియల్ అంటే ప్రాణం, అంతేగా కోట్లకు కోట్లు డబ్బు వస్తుంది. ఒక్క మ్యాచ్ క్లిక్ అయితే చాలు దశ తిరిగిపోతుంది. ఐపిఎల్ కి సెలెక్ట్ అయితే చాలు ఆ రేంజ్ వేరే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదు అయిన లీగ్ గా ఈ లీగ్ కి పేరుంది కూడా. అందుకే ఐపియల్ అనగానే ఆటగాళ్ళు అందరూ ఒక రేంజ్ లో ఉత్సాహంగా ఉంటారు. ఈ మధ్య కాలంలో ఐపియల్ దృష్టిలో పడటానికి,

దేశవాళి క్రికెట్ ని కూడా వాడుకుంటున్నారు. అంత వరకు బాగానే ఉంది గాని ఇటీవల టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొన్ని వ్యాఖ్యలు చేసాడు. తాము అలసిపోతున్నామని, ప్రయాణాలు, ప్రాక్టీస్, మ్యాచ్ లు ఆడటం, తీరికలేని షెడ్యుల్ ఇవన్ని కూడా తమ మీద భారం చూపిస్తున్నాయని అన్నాడు కెప్టెన్. దీనిపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేసారు. విశ్రాంతి ఎందుకు తీసుకోకూడదు అని ప్రశ్నించారు.

తాజాగా టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ క్రికెటర్లకు షాక్ ఇచ్చారు. అలసిపోయామని భావిస్తే ఐపియల్ ఆడకుండా ఉండాలని ఒక సలహా ఇచ్చాడు. దేశానికి ఆడుతుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అన్నారు కపిల్. విశ్రాంతి లేదు, అలసట, ఒత్తిడి ఉందని భావిస్తున్న ఆటగాళ్ళు ఐపియల్ కి దూరంగా ఉండాలని ఒక సలహా ఇచ్చేసాడు. కాగా టీం ఇండియా ప్రస్తుతం న్యూజిలాండ్ తో టెస్ట్ సీరీస్ ఆడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news