టీమిండియా టీ20 వరల్డ్ కప్ కొత్త జెర్సీ ఇదే

టీ 20 వరల్డ్‌ కప్‌ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో టీం ఇండియా కొత్త జెర్సీ ని విడుదల చేసింది భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ). మాములుగా టీం ఇండియా ఆటగాళ్లు ధరించే జెర్సీల కంటే ఈ సారి కలర్‌ డోస్‌ ను కొంచెం ఎక్కువగా ఉండేలా వీటిని తయారు చేశారు. మెన్‌ ఇన్‌ బ్లూ కాస్త… థిక్‌ బ్లూ గా మార్చేశారు.

ఈ మేరకు బీసీసీఐ సోషల్‌ మీడియా వేదికగా కొత్త జెర్సీల ఫోటోలను షేర్‌ చేసేసింది. ఇందులో టీం ఇండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఓపెనర్‌ కే ఎల్‌ రాహల్‌ , ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా, మరియు పేసర్‌ బుమ్రా ఈ కొత్త జెర్సీలను ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. కాగా.. ప్రస్తుతం టీం ఇండియా ఆటగాళ్ల తో పాటు…. విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌ టోర్నీలో బీజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ మరో ముగిసిన… వెంటనే టీ 20 వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది.