‘భోళాశంకర్’ నుంచి మరో మెగా పాట రిలీజ్‌

-

చిరంజీవి మెగాస్టార్‌ మాత్రమే కాదు.. మెగా హ్యూమన్‌ అని కీర్తి సురేష్ అన్నారు. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన కొత్త చిత్రం ‘భోళాశంకర్‌’ . మెహర్‌ రమేశ్‌ దర్శకుడు. తమన్నా కథానాయిక. చిరంజీవి సోదరిగా కీర్తి సురేశ్‌ నటించారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఆమె మాట్లాడారు.

Jam Jam Jajjanaka Lyrical | Bholaa Shankar | Mega Star Chiranjeevi |Meher  Ramesh| Mahati Swara Sagar - YouTube

ఈ లోపే మెగా అభిమానులను ఉర్రూతలూగించేలా ‘తీనుమారు’ అనే హుషారైన గీతాన్ని చిత్రబృందం ఈ సాయంత్రం విడుదల చేసింది. ఈ పాట లిరికల్ వీడియో లింకును చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్లో పంచుకున్నారు. మహతి స్వరసాగర్ బాణీలు సమకూర్చిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించాడు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు. ఏకే ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర తెరకెక్కించిన ‘భోళా శంకర్’ నుంచి ఇప్పటివరకు రిలీజైన పాటలన్నీ ఆడియన్స్ లోకి బాగా చొచ్చుకుని వెళ్లాయి. ఈ పాట కూడా మెగా స్టయిల్లోనే ఉండడంతో అభిమానుల నుంచి విశేష స్పందన వస్తుందని చిత్రబృందం భావిస్తోంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news