తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యవసాయ రంగానికి ప్రభుత్వం రూ. 26,831 కోట్లు కేటాయించింది. ఈ మేరకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక రంగమైన వ్యవసాయ అభివృద్ధియే, ఇతర రంగాల అభివృద్ధికి ఆధారభూతంగా నిలుస్తుందని అన్నారు. సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా రాష్ట్రం నేడు దేశానికి దిశానిర్దేశం చేస్తోందని చెప్పారు.
‘తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాలలోనూ అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఒకప్పుడు సంక్షోభవంతో కొట్టుమిట్టాడిన తెలంగాణ వ్యవసాయానికి తిరి జవజీవాలను అందించడంలో.. రైతుల్లో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ప్రభుత్వం పూర్తిగా సఫలమైంది.’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.