ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

-

ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజైన నేడు.. అసెంబ్లీ మాజీసభ్యులకు సంతాపం ప్రకటించనున్నారు. అధిక వర్షాలు, గోదావరి బేసిన్ లో వరదపై మండలి చర్చించనుంది. సమావేశాల పూర్తి అజెండా నేడు ఖరారు కానుంది. వరదలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలు, నీటిపారుదల ప్రాజెక్టులు, ధరణి ఇబ్బందులు, కేంద్రప్రభుత్వ విధానాలు, ఉద్యోగ నియామకాలు, తదితర అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

గత సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రెండు సభలు సమావేశం కానున్నాయి. ఉభయసభల్లోనూ ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దుచేశారు. మావేశాల అజెండా ఖరారుకు  అసెంబ్లీ, మండలి సభావ్యవహారాల సలహాసంఘాలు సమావేశం కానున్నాయి. సమావేశాల పనిదినాలు, చర్చించే అంశాలు బీఏసీలో ఖరారు చేస్తారు. నాలుగు పనిదినాల పాటుసమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. వినాయక నిమజ్జనం దృష్ట్యా మధ్యలో విరామం ఇచ్చి వచ్చేవారం మళ్లీ కొనసాగించే పరిస్థితి ఉంది. సుమావేశాల్లో పలు అంశాలను ప్రస్తావించేందుకు విపక్షాలు సిద్దమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news