తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చారు బీసీ సంఘాల నేతలు. ఆగస్టు రెండో వారంలో తెలంగాణ రాష్ట్ర బంద్ ఉండబోతుందని బీసీ సంఘాలు వెల్లడించాయి. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు రెండో వారంలో తెలంగాణ రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని బీసీ సంఘాల నేతలు హెచ్చరికలు జారీ చేశారు.

శుక్రవారం హనుమకొండ లోని కాకతీయ యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు బీసీ సంఘాల నేతలు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ పార్టీ నేతలు తమ అధిష్టానాన్ని ఒప్పించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. లేనిపక్షంలో కేంద్ర మంత్రుల పర్యటనలు అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. బీసీ నేతను గులాబీ పార్టీకి అధ్యక్షుడిగా చేస్తామని కెసిఆర్ కూడా ప్రకటించాలని.. ఈ సందర్భంగా వెల్లడించారు.