ఏ నాయకుడికైనా స్థిమితం ఇంపార్టెంట్. పార్టీ పరంగా దూకుడు ప్రదర్శించాల్సిన సమయంలో ప్రదర్శిం చినా.. సీనియర్లను కలుపుకొని వెళ్లడం అనేది ఏ నేతకైనా ముఖ్యం. అయితే, తెలంగాణలో వేళ్లూను కోవాలని భావిస్తున్న బీజేపీలో కరీంనగర్ నుంచి గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీ బండి సంజయ్ తన దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ఆయనసీనియర్లను పట్టించుకోకుండా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో సీనియర్లు ఇప్పుడు ఆయనపై గుస్సాగా ఉన్నారని తెలుస్తోంది.
ఇటీవల జరగిన స్థానిక ఎన్నిక్లలో సంజయ్ తన పార్లమెంటు పరిధిలోనే కాకుండా కరీంనగర్ జిల్లాలో అన్నీ తానై వ్యవహరించారు. సీనియర్ల మాట కాదని తనకు నచ్చిన వారికి టికెట్లు ఇప్పించుకున్నారు. 200 ఓట్లతో 12 సీట్లు బండి సంజయ్ గెలుపు గుర్రాలకు ఇవ్వకుండా సంజయ్ తన వర్గానికి ఇచ్చుకున్నారని మరో వర్గం ఆరోపిస్తోది. ఈ 12 సీట్లలో ఎంపీ వర్గం సమన్వయం చేసుకోకపోవడంతోనే ఇలా జరిగినట్టు ఆరోపణ.
ఇంటి లిజెన్స్ కూడా బీజేపీ 28 సీట్లు గెలుస్తుందని చెపితే కేవలం 13 మాత్రమే వచ్చాయి. పక్కనే ఉన్న నిజా మాబాద్‌లో 28 సీట్లు గెలిస్తే ఇక్కడ 13 గెలవడంతో ఎంపీపై నిప్పులు చెరుగుతున్న ఓ వర్గం మండి పడుతోంది. తాము సూచించిన అభ్యర్తులకు ఇచ్చి ఉంటే.. జిల్లా మొత్తం కూడా బీజేపీకి దక్కి ఉండేదని అంటున్నా రు. ఈ క్రమంలోనే బండి సంజయ్ దూకుడును వారు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని కేంద్రంలోని బీజేపీ అధిష్టానానికి వివరించి బండి దూకుడు కళ్లెం వేయించేలా కొందరు ఇప్పటికే డిల్లీకి నివేదికలు పంపుతున్నారని అంటున్నారు.
వాస్తవానికి జిల్లాలో అధికార టీఆర్ ఎస్‌కు కళ్లెం వేసేందుకుఅనేక అవకాశాలు ఉన్నాయని, అయినా కూడా సంజయ్ కారణంగా ఈ అవకాశాన్ని కోల్పోయామని, ఆయన ఇలానే వ్యవహరిస్తే.. పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందని వారు పేర్కొంటున్నారు. మరి బీజేపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.