Telangana Budget : తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌.. కేటాయింపులు ఇలా.. ఏ శాఖకు ఎంతంటే ?

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే, తెలంగాణ మంత్రి హరీష్‌ రావు బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టారు. తెలంగాణ వార్షిక బడ్జెట్ 2023-24 రూ.2,90,396 కోట్లని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇక 2023-24 తెలంగాణ రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు ఉంటుందని వెల్లడించారు హరీష్‌ రావు.

బడ్జెట్‌ పూర్తి వివరాలు

వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లు

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యవసాయ రంగానికి ప్రభుత్వం రూ. 26,831 కోట్లు కేటాయించింది. ఈ మేరకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్

రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ..రూ. 6385 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 2023-24 తెలంగాణ రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు ఉంటుందని వెల్లడించారు హరీష్‌ రావు.

దళిత బంధుకు రూ. 17, 700 కోట్లు

దళితులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. దళిత బంధుకు ఏకంగా రూ. 17, 700 కోట్లను బడ్జెట్‌ లో ప్రవేశ పెట్టారు మంత్రి హరీష్‌ రావు.

తెలంగాణ నీటి పారుదల రూ. 26,885 కోట్లు

తెలంగాణలో మండు వేసవిలోనూ మత్తడి దూకేలా చెరువులు, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా రిజర్వాయర్లకు చేరుతున్న నదీజలాలలు.. సాగునీటి రంగంలో రాష్ట్రం సాధించిన అద్భుతాలు ఆవిష్కరిస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల రంగానికి బడ్జెట్‌లో రూ.26,885 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.

విద్యుత్‌శాఖకు రూ.12,727 కోట్లు

‘‘అన్నిరంగాలకూ 24 గంటలపాటు నిరంతరాయంగా, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. 7778 మెగావాట్ల సామర్థ్యం నుంచి ప్రస్తుతం విద్యుదుత్పత్తి సామర్థ్యం 18,453 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు. ఈ బడ్జెట్‌లో రూ.12,727 కోట్లను విద్యుత్‌శాఖకు ప్రతిపాదించారు.

తెలంగాణ బడ్జెట్‌ కేటాయింపులు

ఆసరా పింఛన్లు 12,000 కోట్లు

దళిత బంధు 17, 700 కోట్లు

బీసీ సంక్షేమం 6,229 కోట్లు

గిరిజన సంక్షేమం.. షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15, 233 కోట్లు

కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు

బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు,

నీటి పారుదల రంగం 26, 885 కోట్లు,

విద్యుత్ రంగం 12, 727 కోట్లు

ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు.

ఆయిల్ ఫామ్‌కు రూ.1000 కోట్లు..

దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు

ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు..

గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు..

బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు..

వ్యవసాయశాఖకు రూ.26,831 కోట్లు..

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు..

షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు

పంచాయతీరాజ్‌కు రూ.31,426 కోట్లు..

వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు..

విద్యా రంగానికి రూ.19,093 కోట్లు..

రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు..

హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు..

పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు..

రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు..

హోంశాఖకు రూ.9,599 కోట్లు..
మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు..

మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు..

రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు..

రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు..

కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ.200 కోట్లు

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news