తెలంగాణ బడ్జెట్‌పై ఇవాళ శాసనసభలో చర్చ ముగియనుంది. గత రెండు రోజులుగా 24 పద్దులపై చర్చించి ఆమోదించారు. మూడో రోజైన ఇవాళ మిగిలిన 13 పద్దులపై చర్చ జరగనుంది. నీటిపారుదల, సాధారణ పరిపాలన, వాణిజ్యపన్నులు, వైద్యారోగ్యం, ఆర్థిక, పశుసంవర్ధక, హోం, వ్యవసాయ,సహకార,పంచాయతీ రాజ్, రవాణాశాఖ, గవర్నర్-మంత్రిమండలి పద్దులపై చర్చచేపట్టనున్నారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయం, పంచాయతీరాజ్ చట్ట సవరణల బిల్లులపైనా అసెంబ్లీలో చర్చ జరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 18వేల ,257 కోట్ల అనుబంధ వ్యయ అంచనాలను ఆర్థికమంత్రి హరీశ్‌రావు సభలో ప్రవేశపెట్టనున్నారు. చేపల ఉత్పత్తి, ఎస్‌ఆర్‌డీపీ, మెట్రో రైల్‌పొడిగింపు, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, పాల ఉత్పత్తి, నీరా కేఫ్, చెక్ డ్యాంల నిర్మాణం, క్రీడా మైదానాలు, ఫీజు రీఎంబర్స్ మెంట్ తదితర అంశాలు ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి.