నిన్నటి నుంచి అందరూ ఊహించినట్లే… తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ఉద్యోగ విభజన పూర్తి అయిన తర్వాత రాష్ట్రంలో 91,142 ఖాళీలు ఉన్నాయమని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీటిని వెంటనే నోటిఫై చేసి ఉద్యోగ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
కాంట్రాక్ట్ పోస్టులు 11,103 మంది ఉద్యోగులు ఉన్నారని.. వారి వయసు అయిపోతుందని.. ఇటీవలే హైకోర్ట్ పర్మిషన్ ఇచ్చిందని.. త్వరలోనే కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని పర్మినెంట్ చేస్తున్నామని అన్నారు. అయితే.. ఉద్యోగాల భర్తీ పై చేసిన ప్రకటన పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. నిరుద్యోగులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా ఓయూలో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటనపై తెలంగాణ భవన్ లో సంబరాలు జరుపుతున్నారు. నిరుద్యోగ బంధు కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ…టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సంబురాలు జరుగుతున్నారు. అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు నిరుద్యోగులు.