మ‌న భాష హిట్టు.. మ‌న యాస హిట్టు.. మన నేల‌కు జై కొట్టు

-

ఒక రోజు తెలంగాణ
నీళ్లు లేక గోస పెట్టింది
నిధులు లేక గ‌గ్గోలుమంది
ఉపాధి లేక ఊసురోమంటూ
ప‌ల్లెగ‌డ‌ప దాటి ఎంద‌రో
వ‌ల‌స‌వెళ్లారు..ఇప్పుడు సీన్ మారింది
క‌థ మారింది.. వ్య‌థ తీరింది
అంతేనా! ఈ ప్రాంత మాండ‌లికం అంటే
సినిమావాళ్ల‌కు ఉన్న చిన్న‌చూపు తొల‌గిపోయింది
ఇప్పుడు తెలంగాణ నేల‌కు గౌర‌వం అక్క‌డి భాష‌కు గౌర‌వం
ఇస్తోంది తెలుగు సినిమా యాస‌కు ప‌ట్టం క‌డుతోంది తెలుగు సినిమా
ఆనందించాలి అంతా! జై తెలంగాణ ! జై జై తెలంగాణ !

నీళ్లూ,నిధులూ,నియామకాలు ప్రధాన లక్ష్యాలుగా తెలంగాణ ఏర్పడింది.ప్రతిసారీ తెలంగాణ యాస మాట్లాడే వారిని కమెడియన్లు గా…విలన్లుగా చూపిస్తూ తెలుగు సినిమాలు ఉండేవి.కానీ ప్రస్తుతం తెలంగాణ మాండ‌లికం లేనిదే సినిమా లేదంటే ఆ మాట వాస్త‌వ దూరం కాదు.చిత్రం ఏంటంటే ఇవాళ తెలుగు సినిమాలో మారిన పోక‌డ‌లు లేదా ప‌రిణామాల కార‌ణంగా హీరోలూ, హీరోయిన్లూ తెలంగాణ యాస మాట్లాడితే ప్రేక్ష‌కులు వారిని ప్రాంతాల‌క‌తీతంగా నెత్తిన పెట్టుకుంటున్నారు.అంతలా మారింది తెలుగు సినిమా తీరు.తాజాగా ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో చెప్పారు.ఒకప్పుడు తెలంగాణ యాస అంటే జోకర్లకు,విలన్లుకు వాడే వారని..అలాంటిది ఇప్పుడు తెలంగాణ యాస మాట్లాడితేనే హీరోలు క్లిక్ అవుతున్నారని అన్నారు.

ఆ రోజు తెలంగాణ నీళ్లూ,నిధులూ,నియామకాలపైనే పోరాటం చేసింది.తెలంగాణ ఉద్యమ లక్ష్యం కూడా అదే. తెలంగాణ సాధించుకున్న తరువాత కాళేశ్వరం,మ‌ల్ల‌న్న సాగ‌రం,పాలమూరు – రంగారెడ్డి త‌దిత‌ర భారీ ప్రాజెక్టుల‌ను కడుతూ..సాగుకు, తాగు నీటి అవసరాలను తీర్చుకుంటోంది.ఇదే సమయంలో ఏపీలో మాత్రం అనుకున్నంత వేగంగా ప్రాజెక్ట్ ల నిర్మాణం జరగడం లేదు.రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మొదలైన పోలవరం ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉంది.అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం రెండేళ్లలోనే పూర్తి చేసి రికార్డ్ క్రియేట్ చేసింది తెలంగాణ.తెలంగాణ ఏర్పాటు సమయంలో పాలన రాదు..కరెంట్ లేక అంధకారం అవుతుందని కామెంట్లు చేసిన వారే ప్రస్తుతం తెలంగాణ ప్రగతిని పొగడాల్సిన పరిస్థితి వస్తోంది.తెలంగాణ ఆర్థిక ప్రగతి మెరుగ్గా ఉంటే..ఏపీ మాత్రం తీవ్ర ఆర్థిక లోటును ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇక నియామకాల విషయంలో కూడా తెలంగాణ దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ రోజు ఏకంగా ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే 1.30 లక్షలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశారు.మరోవైపు ఉద్యోగ నియామకాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.స్థానికులకే స్థానిక ఉద్యోగాలు వచ్చే విధంగా 95 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకున్నాను.కొత్తగా ఏడు జోన్లను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం వచ్చే ఏడాది నుంచి వార్షిక ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్-లో ఉద్యోగ భర్తీకి సంబంధించి అధికార పక్షాన్ని,ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.తెలంగాణ ప్రజలు సాధించి తెచ్చుకున్న కలలు సాకామయ్యేలా పురోగమిస్తోంది.తెలంగాణ ప్రజలు కలలు కన్న నీళ్లు, నియామకాలు, నిధులు ఇలా అన్నింటిలో ప్రగతి సాధిస్తున్నాయి.నిధుల విషయంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారింది.ఆర్థిక సంబంధ వ్య‌వ‌హారాల్లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ విభాగంలో మంచి ఫలితాలు సాధిస్తోంది. తలసరి ఆదాయంలో,తలసరి విద్యుత్ వినియోగంలో, పట్టణీకరణలో,వ్యవసాయ ప్రగతిలో గణనీయమైన ప్రగతి సాధించింది.ఈ విషయాల్లో ఏపీ తెలంగాణ కన్నా వెనకబడే ఉంది అన్న‌ది ఓ వాస్త‌వం.

– వేణుగోపాల్ – మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news