Telangana : తొలిసారిగా రూ.3లక్షల కోట్ల మార్కు దాటనున్న రాష్ట్ర బడ్జెట్‌

-

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ మొదటిసారి రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్ల మార్కు దాటనుంది. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ కావడంతో మరోమారు భారీ బడ్జెట్ రానుంది. సంక్షేమం, అభివృద్ధి పథకాలకు పెద్దపీట వేస్తూ పద్దును ప్రతిపాదించనున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షలా 56 వేల కోట్లు కాగా వచ్చే ఏడాది వృద్ధిరేటు 15 నుంచి 17 శాతం వరకు ఉండవచ్చని అంచనా వేసి ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. దీంతో 2023- 24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మూడు లక్షల కోట్లు దాటినట్లు తెలిసింది. ఎ

న్నికలకు ముందు వస్తున్న బడ్జెట్ కావడంతో సంక్షేమ రంగానికి సింహభాగం నిధులు కేటాయించినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలకు నిధులు పెరిగాయి. సొంత రాబడిపైనే ఎక్కువగా ఆధారపడి పూర్తి విశ్వాసంతో ఆశావాహ బడ్జెట్‌ను రూపొందించారు.

Read more RELATED
Recommended to you

Latest news