తెలంగాణ బ‌డ్జెట్.. రైతు రుణ మాఫీకి భారీ ప‌ద్దు!

-

ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. కాగ తొలి రోజే.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావు.. బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర కేబినేట్.. బ‌డ్జెట్ కు ఆమోదం తెలిపింది. కాగ ఈ సారి గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం బ‌డ్జెట్ ప‌ద్దు కన్నా.. దాదాపు 15 శాతం నిధులు పెంచే అవ‌కాశం ఉంది. దీంతో ఈ ఆర్థిక సంవ‌త్స‌రానికి బడ్జెట్ రూ. 2.60 కోట్ల నుంచి రూ. 2.70 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా.

కాగ ఈ బ‌డ్జెట్ సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్య‌త ఇచ్చేలా ఉంటుంద‌ని తెలుస్తోంది. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిక‌ల హామీల‌ను అమలు చేయ‌డానికి ఈ బ‌డ్జెట్ లో భారీ మొత్తంలో ప‌ద్దు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. కాగ టీఆర్ఎస్ హామీల‌లో దాదాపు అన్ని అమ‌లు అయినా.. నిరుద్యోగ భృతి, రైతు రుణ మాఫీ వంటి హామీలు అమ‌లు కాలేదు.

కాగ రైతు రుణ మాఫీ ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం రూ. 37 వేల లోపే అమ‌లు చేసింది. కానీ రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు రూ. ల‌క్ష వ‌ర‌కు రుణ మాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చింది. అయితే ఈ బ‌డ్జెట్ స‌మావేశాల్లో రైతు రుణ మాఫీ కోసం ప్ర‌త్యేకంగా భారీ మొత్తంలో నిధులు కేటాయించే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news