దళితులకు కేసీఆర్ శుభవార్త..దళిత బంధుకు రూ.20 వేల కోట్లు కేటాయింపు !

-

కేసీఆర్ సర్కార్.. దళిత బందు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునేందుకు ఈ పథకాన్ని తీసుకు వచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ పథకం నూటికి నూరుశాతం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ తరుణంలో దళిత బంధు పథకం పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దళిత బంధు పథకం ఇంకా ముందుకు సాగేందుకు.. ఈ సారి బడ్జెట్‌ లో ఎక్కువ నిధులు కేటాయించేలా కనిపిస్తోంది. ఇవాళ్టి బడ్జెట్‌ లో దళిత బంధు రూ.20 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు సమాచారం అందుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఈ బడ్జెట్‌ లోనే.. దళిత బంధు పథకాన్ని విజయ వంతంగా అమలు చేయాలని యోచిస్తోంది.ఈ ఏడాది బడ్జెట్‌ 2.60 లక్షల కోట్ల నుంచి రూ. 2.70 లక్షల కోట్ల మధ్య ఉండే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అనుగుణంగానే ఈ సారి బడ్జెట్‌ లో సాగు, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news