మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ… ఢిల్లీ పర్యటన సారాంశాన్ని వివరించనున్న మంత్రులు

-

మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లో సీఎంతో మంత్రులు భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలు విషయంపై ఇటీవల తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలో జరిగిన పరిణామాలు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి మంత్రులు వివరించనున్నారు. ఈ భేటీకి మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులతో భేటీ అనంతరం సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలపై నిరసనలు, ఆందోళనకు కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. 

నిన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ లో తెలంగాణ మంత్రుల సమావేశం జరిగింది. తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని సేకరించాలని కేంద్రమంత్రిని కోరారు. అయితే కేంద్రం మాత్రం ‘ రా’ రైస్ మాత్రమే తీసుకుంటామన స్పష్టం చేసింది. ఈసమయంలోనే కేంద్రమంత్రి పియూష్ గోయల్, మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు చేయాలని పీయూష్ గోయల్ అనగా.. భగవంతుని దయవల్ల త్వరలోనే ఇది జరుగుతుందని.. రెండు సీట్లున్న మీరు అధికారం చేపట్టిన సంగతిని గుర్తు చేశారు ప్రశాంత్ రెడ్డి. ఇదిలా ఉంటే పీయూష్ గోయల్ రైతులను కేసీఆర్ రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news