ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సిగ్గులేని బతుకులు మీవి…. చంద్రబాబుపై కోడాలి నాని ఫైర్

-

జగన్ మోహన్ రెడ్డిలో ప్రవహించే రక్తం వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి రక్తం అని.. మీలాగా వెన్నుపోటు పొడిచే రక్తం కాదని చంద్రబాబు నాయుడు, లోకేష్ పై విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సోనియా గాంధీకి  40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు భయపడుతున్న రోజుల్లో… 16 నెలలు జైల్లో ఉండీ కూడా జగన్ వెనక అడుగు వేయలేదని.. 151 ఎమ్మెల్యేలను గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. మీది కుక్క బతుకు అంటూ .. చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. 74 ఏళ్ల వయసులు ఎన్టీఆర్ కుర్చీ లాక్కుని, పార్టీ నుంచి సస్పెండ్ చేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. నారా లోకేష్ కు సీఎం జగన్ కు పాతాళానికి, ఆకాశానికి ఉన్న  తేడా ఉందని విమర్శించారు. పిచ్చికుక్కలాగా నారా లోకేష్ మొరగవద్దని విమర్శించారు. తెలుగు దేశం పార్టీ జగన్ వ్యాఖ్యలను తప్పుదారి పట్టిస్తోందని కొడాలి నాని విమర్శించారు. అన్ని ప్రాంతాల సమాన డెవలప్మెంట్ కోసమే వికేంద్రీకరణ అని ఆయన అన్నారు. శవాలు మీద పేలాలు ఏరుకునే బ్యాచ్ చంద్రబాబు, నారాలోకేష్ ది అని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news