షుగర్ ఫ్రీ ఎంత డేంజరో తెలుసా? 92 రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయట..!

-

ఈ రోజుల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోతున్నారు. చిన్న వయసు వారిని కూడా డయబెటీస్ వదలడం లేదు. దీంతో.. షుగర్ వస్తుందన్న భయం ఒకింత, అప్పటికే.. మధుమేహంతో భాదపడేవారు.. తియ్యని పదార్థాలు తినకూడదనే ఆలోచన.. వెరసి.. చెక్కరను పక్కను నెట్టేశారు.. ఇ్కకడ వరకూ సీన్ బానే ఉంది.. కానీ.. తీపి తినాలనే ఆలోచన మాత్రం పోవడం లేదు కదా.. దానికోసం మార్కెట్ లో దొరికే షుగర్ ఫ్రీ ఐటమ్స్ వాడేస్తున్నారు. షుగర్ ఫ్రీ అనగానే.. హమ్మయ్యా స్వీట్ కాదు.. వాడినా ఏం కాదులే అని తెచ్చుకుని తెగ ఉపయోగిస్తారు. వైద్యులు ఎప్పటినుంచో చెబుతున్నారు.. షుగర్ ఫ్రీ అయినా కూడా వాడొద్దని. గుడ్డికంటే మెల్ల మేలని.. షుగర్ కంటే.. షుగర్ ఫ్రీ మేలు అనుకుని మనం వాడేస్తున్నాం. ఇప్పడు జరిగిన పరిశోధనలో షాకింగ్ విషయం వెల్లడైంది..
నిజానికి ‘అస్పర్టమ్‌’ అనే కృత్రిమ స్వీటెనర్‌ను షుగర్‌ ఫ్రీ పేరుతో మార్కెట్‌లో విక్రయిస్తున్నారట.. అస్పర్టమే సాధారణ చక్కెర కంటే 200 రెట్లు తియ్యగా ఉంటుంది. ఇంకా హైలెట్ ఏంటంటే.. ఈ రసాయనం అధిక ఉష్ణోగ్రతల వద్ద విషపూరితంగా మారుతుంది. మనం కాఫీల్లో, టీల్లో షుగర్ ఫ్రీ వాడటం వల్ల ఇది పాయిజన్ అవుతుందని డైటీషియన్-న్యూట్రిషనిస్ట్ శివాని కంద్వాల్ పేర్కొన్నారు. చక్కెర లేని ఆహారాన్ని దీర్ఘకాలికంగా ఉపయోగించడం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా, షుగర్ ఫ్రీని రెగ్యులర్ గా ఉపయోగించే వారికి తలనొప్పి, ఒత్తిడి, గుండె వేగం పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయట.
కృత్రిమ స్వీటెనర్ షుగర్ ఫ్రీ 92 సైడ్ ఎఫెక్ట్స్..
 కొన్ని అంతర్జాతీయ అధ్యయనాలలో, చక్కెర లేని ఆహారాన్ని ఎక్కువ కాలం తీసుకునే వ్యక్తులలో 92 రకాల దుష్ప్రభావాలు గుర్తించారట.. షుగర్ ఫ్రీ ఫుడ్స్ ఎక్కువగా వాడటం వల్ల అనేక ఇతర సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా కంటి, చెవి, తల, జీర్ణకోశ, మానసిక రుగ్మతలు, చర్మ సంబంధిత రుగ్మతలు వస్తున్నాయి. అమెరికన్ పోషకాహార నిపుణుడు డా. జానెట్ ఏం చెప్తున్నారంటే..అస్పర్టమే నిరంతర ఉపయోగం శరీరంలోని అన్ని భాగాలలో దాదాపు 92 రకాల సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుంది. ఇది ఒక వ్యక్తిని చాలా అనారోగ్యానికి గురి చేస్తుంది. టీ లేదా కోక్ వంటి పానీయాలలో అస్పర్టమేను వాడటం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు చాలా సులభంగా చేరి కణజాలాలలో పేరుకుపోయి స్లో పాయిజన్ లా మారుతుందట.
డయాబెటిస్ లేనివారు షుగర్ ఫ్రీని అసలు ఎందుకు వాడటం.. మధుమేహం లేదా ఊబకాయాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, స్వీట్లు తినడం మానేయండి. స్వీటెనర్లకు ప్రత్యామ్నాయంగా లభించే కృత్రిమ స్వీటెనర్లన్ను అన్నీ మానేయాలి. మళ్లీ షుగర్ ఫ్రీ పేరుతో.. మిమ్మల్నీ మీరు సాటిస్వ్ ఫై చేసుకుని తీపిని తింటున్నారనే విషయాన్ని మర్చిపోయారు. షుగర్ ఫ్రీ కారణంగా ఊబకాయం కూడా పెరుగుతుందట. ఇకనైనా షుగర్ ఫ్రీ వాడేవాళ్లు మానేయటం మంచిది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news