తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్నా.. దానికి అనుగుణంగా తెలంగాణలో ఎదగలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ. దీంతో వచ్చే ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు కదులుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రతిపక్షాలతో కన్నా స్వపక్షంలోని నేతలతోనే ఎక్కువగా కొట్లాడాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఇంటి సమస్యలే పెద్ద సమస్యగా మారుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ తో టీపీసీసీ చీఫ్ జగ్గారెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ వ్యవహారాలతో పాటు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారంపైనే భేటీ అయ్యారని తెలుస్తోంది. అయితే తన రాజీనామాను 15 రోజుల వాయిదా వేసిన జగ్గారెడ్డి, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా ముందుకు వెళ్లాలనేదానిపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.