తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రోజు రోజుకు ఈ వైరస్ తీవ్రత పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. ఈ ఫోన్లు తీసుకున్న అనంతరం.. ఆయా అనాధ పిల్లలు ఏదైనా సహాయం అవసరమైనప్పుడు అధికారులను సంప్రదించవచ్చు. ఒక్క హైదరాబాదు జిల్లాలోనే కరోనా బారినపడి తల్లిదండ్రులు మరణించడంతో 85 మంది పిల్లలు అనాధలుగా మిగిలిపోయారు.
దీంతో పాటు తల్లిదండ్రులులలో ఒకరు మరణించిన అనాధలు సైతం ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 138 మంది అనాధ పిల్లలు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. అనాధ పిల్లల భద్రత దృష్ట్యా వారి సమస్యలను అధికారులు తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంది. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా అనాధ పిల్లలకు ఎలాంటి అవసరలైన తీరుతాయని పేర్కొన్నారు అధికారులు.