ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు ఖరారు చేసిన తెలంగాణ సర్కార్

-

తెలంగాణ ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాలల ఫీజులను ఖరారు చేసింది. ఫీజులు ఖరారు చేస్తూ తాజాగా జీవో కూడా జారీ చేసింది. ఏఎఫ్‌ఆర్సీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని 159 కాలేజీల్లో ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీవో ప్రకారం కాలేజీల్లో కనీస రుసుం ₹45వేలకు పెంచుతున్నట్లు పేర్కొంది.

రాష్ట్ర వ్యాప్తంగా 40 కాలేజీల్లో ఫీజు రూ.లక్ష దాటింది. ఎంజీఐటీ ₹1.60లక్షలు, సీవీఆర్‌ ₹1.50లక్షలు, సీబీఐటీ, వర్ధమాన్‌, వాసవీ కాలేజీల్లో ₹1.40లక్షలుగా నిర్ణయించారు. ఫీజుల పెంపు మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అయితే, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెంపుపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఎల్లుండి నుంచి ఇంజినీరింగ్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news