తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కి తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. గవర్నర్ వ్యవహార శైలి పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె పది బిల్లులను ఆమోదించకపోవడంపై చీఫ్ సెక్రటరీ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశించారని కోరారు. పిటిషన్ లో గవర్నర్ ను ప్రతివాదిగా చేర్చారు.
తెలంగాణ ప్రభుత్వం పంపిన పది బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తొక్కి పెట్టారని, బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ నుంచి ఏడు బిల్లులు, గత నెల నుండి మూడు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.