టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పులకేసి లోకేష్ దెబ్బకి టీడీపీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయన్నారు. పులకిసి లోకేష్ ఒక మాలోకం అని, ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర జనాలు లేక వెలవెలబోతుందని ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీకి ఉన్న పరువు కూడా పోతుందని చెప్పారు.
కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ ను రాష్ట్ర నాయకుడిని చేశారని అన్నారు. లోకేష్ యాత్రకి ఎఫెక్ట్ కాకూడదని పవన్ కళ్యాణ్ వారాహిని కూడా ఆపేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలలో పోటీ చేస్తామని జగన్ చెప్పారని.. దమ్ముంటే లోకేష్, పవన్ కూడా 175 స్థానాలలో పోటీ చేస్తామని చెప్పాలని చాలెంజ్ చేశారు. పొత్తులు లేకుండా చంద్రబాబు ముందుకు వెళ్లలేరని, జగన్ మాత్రం సింహం లాగా సింగల్ గా ముందుకు సాగుతున్నారని అన్నారు.