పవన్‌ కల్యాణ్‌ పై తెలంగాణ గవర్నర్‌ ప్రశంసలు

జన సేన పార్టీ అధినేత, టాలీవుడ్‌ స్టార్‌ హీరో పవన్‌ కళ్యాణ్‌ పై తెలంగాణ గవర్నర్‌ తమిళి సై ప్రశంసలు కురిపించారు. కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేయడాన్ని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అభినందించారు. కళాకారుడికి పవన్‌ సాయం అందించడం ఎంతో స్ఫూర్తికరమన్నారు గవర్నర్‌ తమిళి సై.

పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్‌ కళ్యాణ్‌ ను అభినందిస్తూ గవర్నర్‌ తమిళి సై ట్వీట్‌ చేశారు. కాగా… ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న సినిమా భీమ్లా నాయక్ లో పాట‌కు కిన్నెర తో స్వరాలు అందించిన కిన్నెర మొగుల‌య్యకు ఆర్థిక‌సాయం ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. కిన్నె ర క‌ళ అనేది అరు దైన క‌ళ అని మొగుల‌య్య లాంటి క‌ళాకారుల‌ను కాపాడా ల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ రూ.2ల‌క్షల ఆర్థిక సాయాన్ని ప్రక‌టించారు.