మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. బాడీకి సరిపడా ఆహారం తీసుకోవాలి.. ఆ ఆహారం సమయానికి జీర్ణం కావాలి. వ్యర్థాలు బయటకు రావాలి.. ఈ ప్రాసెస్ సరిగ్గా జరకగపోతే.. రోగాల బారిన పడక తప్పదు. మనం తాగే వాటర్, డ్రింక్స్ ఇవన్నీ మూత్రం రూపంలో బయటకు వస్తుంటాయి.. అయితే కొంతమంది రోజులో చాలాసార్లు టాయిలెట్‌కు వెళ్తారు.. అసలు ఆరోగ్యంగా ఉంటే రోజుకు ఎన్ని సార్లు వెళ్తారు. ఎక్కువసార్లు టాయిలెట్‌కు వెళ్లడానికి కారణం ఏంటి.? ఇది కూడా ఏదైనా సమస్యకు దారితీస్తుందా..?
సాధారణ మూత్రవిసర్జన ఫ్రీక్వెన్సీ..
ఆరోగ్యకరమైన వ్యక్తి 24 గంటల వ్యవధిలో సగటున రోజుకు 6 – 7 సార్లు మూత్ర విసర్జన చేయడం సహజం. కొన్ని పరిస్థితులలో రోజుకు 4, 10 సార్లు మూత్ర విసర్జన చేసినా అది కూడా సాధారణమే.. కానీ, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, మూత్ర విసర్జన సౌకర్యవంతంగా సాగాలి. ఒకవేళ వారికి ఇందులో ఏదైనా ఇబ్బంది కలిగితే అది సాధారణ మూత్ర విసర్జన అనిపించుకోదు. అలాగే ఒక వ్యక్తి ఒక రోజులో 2 లీటర్ల ద్రవాన్ని తాగి, రోజుకు ఏడు కంటే ఎక్కువ సార్లు , మూత్ర విసర్జన చేయాల్సి వస్తే అది అతిమూత్ర విసర్జనగా చెప్పొచ్చు..
అతి మూత్ర విసర్జనకు కారణాలు..
మధుమేహం
తరచుగా మూత్రవిసర్జన చేయడం టైప్-1 , టైప్-2 మధుమేహం ప్రారంభ లక్షణం అని వైద్యులు అంటున్నారు. మధుమేహం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇది మరింత గ్లూకోజ్‌ను ఫిల్టర్ చేయడానికి మూత్రపిండాలపై ఒత్తిడి చేస్తుంది.. దీనివల్ల ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీల పనితీరు దెబ్బతింటాయి.. మీరు తరచుగా మూత్ర విసర్జనకు వెళుతుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
OAB
అతి చురుకైన మూత్రాశయం కూడా తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరికను కలిగిస్తుంది. ఈ సమయంలో మూత్రాన్ని నియంత్రించడం కష్టం. తరచుగా మూత్రవిసర్జన ఈ పరిస్థితి సాధారణ లక్షణం.
కిడ్నీ స్టోన్స్..
కిడ్నీ స్టోన్స్ తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతాయి. మూత్రాశయంలోని ఖనిజాలు, ప్రోటీన్లు రాళ్ల వంటి స్ఫటికాలు మూత్రనాళాల్లో అడ్డుపడతాయి. ఇవి తరచుగా మూత్ర విసర్జన చేసే కోరికను కలిగిస్తాయి.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్-UTI
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా తరచుగా మూత్ర విసర్జనకు దారితీస్తుంది. కానీ ఈ సమస్య ఉన్న కొందరికి మూత్రంలో మంట, రక్తస్రావం కూడా ఉండవచ్చు. కడుపు నొప్పి కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
పురుషులలో ప్రోస్టేట్ సమస్య..
పురుషులలో తరచుగా మూత్రవిసర్జన చేయడం ప్రోస్టేట్ సమస్యలకు సంకేతంగా చెప్పుకోవచ్చు…విస్తరించిన ప్రోస్టేట్ సంక్రమణ, ప్రోస్టేట్ వాపు, ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతుంది.
మహిళల సమస్యలు
మహిళల్లో తరచుగా మూత్రవిసర్జన యూటీఐ, ఓఏబీ, బ్లాడర్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ప్రెగ్నెన్సీ, ఫైబ్రాయిడ్స్, మెనోపాజ్, అండాశయ క్యాన్సర్, ఈస్ట్రోజెన్ తక్కువగా విడుదల కావడం కూడా కారణం కావచ్చు. కాబట్టి, అలాంటి సమస్యలు ఉంటే, నిర్లక్ష్యం చేయకండి, వెంటనే నిపుణులైన వైద్యుడిని సంప్రదించండి.