కొత్త కరోనా టెన్షన్ : టీ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ మళ్ళీ టెస్ట్ లు !

-

కొత్త కరోనా టెన్షన్ నేపధ్యంలో టీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్, బెల్జియం, యూకే, ఇటలీ, ఈస్ట్ యూరోపియన్ దేశాలు.. జర్మనీ, నెదర్లాండ్స్ నుంచి వచ్చిన వాళ్ల పై ఫుల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ వైద్యారోగ్యశాఖ. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 9 వరకు వచ్చిన వాళ్ళను ఒక గ్రూప్ చేస్తూ వాళ్లంతా సెల్ఫ్ హోమ్ క్వారంటైన్ లు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 9 నుంచి ఇవాళ్టి వరకు వచ్చిన వాళ్లందరికీ ముందుగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయనున్నారు.

పాజిటివ్ వచ్చిన వాళ్లను టిమ్స్ కు వాళ్ళ కుటుంబాలను నేచర్ క్యూర్ కు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ టెస్టులు చేయించుకుని వచ్చాం అన్నా సరే.. ప్రతి ఒక్కరి శ్యాoపిల్స్ సేకరించాల్సిందేనని అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ రోజు శ్యాoపిల్స్ సేకరణ పూర్తి చేయాలని జిల్లా వైద్య అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో కొత్త కరోన మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు వైద్యాధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news