BJP vs TRS హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక సందర్భంగా ‘దళిత బంధు’ స్కీమ్2ను పైలట్ ప్రాజెక్టుగా సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి అందరికీ విదితమే. ఇక ఈ స్కీమ్‌లో భాగంగా దళితులకు రూ.10 లక్షల చొప్పున బ్యాంకు ఖాతాలో వేయనున్నారు. ఆల్రెడీ ఈ స్కీమ్‌కు రూ.500 కోట్లు కేటాయించిన కేసీఆర్, మరో రెండు వేల రూపాయల కోట్లు కేటాయించింది ప్రజలందరినీ విశ్వాసంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కాగా, ‘దళిత బంధు’ స్కీమ్‌కు కౌంటర్ అటాక్ బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ స్టార్ట్ చేశారు.
బీజేపీ నేతలందరూ గ్రామాలకు వెళ్లి సీఎం కేసీఆర్ ఇస్తానని చెప్పిన పది లక్షల రూపాయలు తమకు కూడా ఇవ్వాలంటూ ప్రజలందరూ అప్లికేషన్స్ చేయాలని మొత్తంగా ‘దరఖాస్తుల’ ఉద్యమం చేయాలని నిర్ణయించారు. మొత్తానికి టీఆర్ఎస్ సర్కారును ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సంజయ్. ఈ ప్రోగ్రాం ద్వారా భారీ ఎత్తున దరఖాస్తుల్ని సేకరించయడం ద్వారా టీఆర్ఎస్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటున్నారు. అయితే, ఈ ‘దరఖాస్తుల’ ఉద్యమాన్ని స్వాగతిస్తూనే ప్రజా కోర్టులో కౌంటర్ వేసేందుకు పూనుకున్నారు మంత్రి కేటీఆర్.
ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతీ ఒక్క పేద కుటుంబానికి రూ.15లక్షల మొత్తాన్ని వారిఖాతాల్లో వేస్తానని గొప్పలు చెప్పారని, ఈ క్రమంలో ప్రధాని ఇస్తానని చెప్పిన డబ్బుల కోసం అప్లికేషన్‌ను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఇవ్వాలని పిలుపునిచ్చారు. మొత్తానికి ‘బండి’ షురూ చేసిన ఉద్యమాన్ని ఆయనకే ఇబ్బందులు తెచ్చే విధంగా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. మొత్తంగా తెలంగాణ రాజకీయం ‘దళిత బంధు’ నేపథ్యంలో BJP vs TRS అనే సీన్ ఆల్రెడీ క్రియేట్ అయిందని చెప్పొచ్చు. ఇకపోతే హుజురాబాద్ బై పోల్‌లోనూ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే సీన్ ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.