తెలంగాణలో అయిదంచెల వైద్య వ్యవస్థ : హరీశ్ రావు

-

రాష్ట్రంలో గతంలో మూడంచెల వైద్య వ్యవస్థ ఉండగా.. ప్రస్తుతం పల్లె/బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, సూపర్‌ స్పెషాలిటీల రూపంలో అయిదంచెల్లో వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. 2022లో ఒకేసారి 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించడం దేశ చరిత్రలోనే రికార్డు అని తెలిపారు.‘ అన్ని వయసుల వారికి ఆరోగ్యం.. అన్ని దశల్లో ఆరోగ్యం’ నినాదంతో రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యంపై పేదలకు నమ్మకం పెరిగిందని హరీశ్ రావు అన్నారు. అత్యుత్తమ వైద్య సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ 2022 వార్షిక నివేదికను ఆదివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో హరీశ్‌రావు విడుదల చేసి మాట్లాడారు. ‘‘వైద్యఆరోగ్య శాఖ తలసరి బడ్జెట్‌లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news