Telangana : వైద్య ఆరోగ్యశాఖ‌కు రూ.12,161 కోట్లు కేటాయింపు

-

పేద ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి లక్ష జనాభాకు సగటున 19 ఎంబీబీఎస్‌ సీట్లతో వైద్య విద్యలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. కంటి వెలుగు ద్వారా 1 కోటి 54లక్షల మందికి పరీక్షలు నిర్వహించి 40లక్షలకు పైగా కళ్లద్దాలను పంపిణీ చేసిందని చెప్పారు. హైదరాబాద్‌ నగరం నలువైపులా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తోందని వెల్లడించారు. వైద్య, ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్‌లో రూ.12,161 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు.

‘రూ.1100 కోట్ల ఖర్చుతో రెండు వేల బెడ్ల సామర్థ్యంతో వరంగల్‌లో హెల్త్‌ సిటీ నిర్మాణాన్ని ప్రారంభించింది. డయాలసిస్‌ సేవలు, మాతాశిశు ఆరోగ్యం.. పౌష్టికాహారం, కేసీఆర్‌ కిట్‌, కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ వంటి వాటితో పాటు, క్యాన్సర్‌, ఎయిడ్స్‌ వ్యాధులతో అవసాన దశకు చేరిన రోగులకు ప్రభుత్వం పాలియేటివ్‌ కేర్‌ను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది.’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news