తెలంగాణాలో కరోనా కేసులపై హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్ట్ మండిపడింది. కోవిడ్ హాస్పిటల్స్ సంఖ్య పెంచడం లేదు అందుకే ప్రజలు కార్పోరేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్స్ ఆపరేటర్ల అక్రమాలకు ఎందుకు చెక్ పెట్టడం లేదని విచారణ సందర్భంగా నిలదీసింది. ఎందుకు జీహెచ్ఎంసి లో చావులు అధికంగా వస్తున్నాయని ప్రభుత్వాన్ని నిలదీసింది.
ప్రభుత్వం అలసత్వం వలనే కరోనా కేసులు 10 వేలు దాటుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి హాజరు కావాలని ఆదేశించింది. త్వరలో తెలంగాణాలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీలు సభలు నిర్వహిస్తున్నారని కోర్ట్ కి పిటీషనర్ లు వివరించారు. తెలంగాణాలో లాక్ డౌన్ పెట్టే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ లు విజ్ఞప్తి చేసారు.