శాంతియుత తెలంగాణను కల్లోల తెలంగాణగా చేసేందుకు బండి సంజయ్ కుట్ర – మహమూద్ అలీ

-

తెలంగాణ హోమ్ మంత్రి మహమూద్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్‌ ఎపిసోడ్‌ అనంతరం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని.. దీనికి నిదర్శనం రాష్ట్రంలో ప్రపంచంలోని బహుళ జాతి కంపెనీలు తమ కార్యాలయాలను, సంస్థలను ఏర్పాటు చేయడమేనన్నారు. శాంతి భద్రతలు అదుపులో లేవని బండి సంజయ్ వ్యాఖ్యానించడం ఆయన అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు.

సైబర్ నేరాల అదుపులో, నేరాల నమోదు, నేరస్తులను పట్టుకోవడం, డబ్బును రికవర్ చేయడంలో తెలంగాణా రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ అని తెలిపారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సైబర్ నేరాల నియంత్రణ కై ఏర్పాటు చేసిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ( I 4 C ) తో అనుసంధానం చేసి టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం.. తెలంగాణ అన్నారు.

సైబర్ నేరాల బాధితులకు, న్యాయం చేయడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజ అని చెప్పారు. శాంతియుత తెలంగాణా రాష్ట్రాన్ని కల్లోల తెలంగాణ రాష్ట్రం గా చేయడానికి బండి సంజయ్ తోపాటు ఆయన పార్టీ నాయకులు కుట్ర అని వివరించారు. ఈ కుట్రపూరిత చర్యలను ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news