వినాయక చవితి 2022: ఈ దిక్కులో విఘ్నేశ్వరుడిని పెట్టి పూజిస్తే విఘ్నాలు వుండవు..!

-

హిందులవులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. శివుడు పార్వతిల కుమారుడైన వినాయకుడి పుట్టిన రోజు సందర్భంగా వినాయక చవితి మనం జరుపుకుంటాము. ఒక్కొక ప్రాంతంలో ఒక్కో విధంగా గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. భాద్రపద శుక్ల చతుర్థినాడు గణేష్ ఉత్సవాలు మొదలవుతాయి. ఈ సంవత్సరం ఆగస్టు 31 న వినాయక చవితి వచ్చింది. అయితే చాలా మందికి వినాయక చవితికి సంబంధించి సందేహాలు ఉంటాయి. వాటి కోసం ఇప్పుడే క్లియర్ చేసుకోండి.

వినాయకుడికి పూజ చేయడం వల్ల ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి. ఆనందంగా ఉండడానికి అవుతుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వినాయకుడికి పూజ చేసే విధానంలో కొన్ని నియమాలు ఉన్నాయి. మీరు వినాయకుడి ప్రతిమను ఎంచుకునేటప్పుడు అందులో మూషికము ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే వినాయకుడి వాహనం మూషికం కనుక. అలానే వినాయకుడి విగ్రహంలో లడ్డు కూడా ఉండేట్టు చూసుకోండి. దీని వల్ల మంచే కాదు విగ్రహం కూడా అందంగా ఉంటుంది.

వినాయకుడి విగ్రహం పూర్తిగా ఉండేటట్లు చూసుకోండి. చాలామంది విరిగిపోయిన వాటిని పూజిస్తారు దీనివల్ల నెగటివ్ ఎనర్జీ వచ్చి పాజిటివ్ ఎనర్జీ పోతుంది. మట్టి విగ్రహాలను మాత్రమే ఎంపిక చేసుకోండి ఎందుకంటే వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. ఇక ఏ దిక్కులో వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి అని చూస్తే.. వాస్తు ప్రకారం పశ్చిమ, ఉత్తరం, ఈశాన్య దిశలలో విగ్రహాన్ని ఉంచడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news