ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..నేటి నుండి హాల్ టికెట్లు..!

-

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ లను ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. ఈనెల 25 నుండి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు.

హాల్ టికెట్ లో ఏవైనా తప్పులు ఉంటే కాలేజీ ప్రిన్సిపల్ లేదంటే జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. అంతేకాకుండా హాల్ టికెట్ లపై ప్రిన్సిపల్ సంతకం లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఇతర కారణాలవల్ల ఇంటర్ పరీక్షలను నిర్వహించలేదు. అంతేకాకుండా విద్యార్థుల గత మార్కులను ఆధారంగా చేసుకొని పాస్ చేస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news