విమానాల తయారీ కేంద్రం గా హైదరాబాద్ మారనుంది. విమానాల తయారీకి హైదరాబాద్ ను హబ్ గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విమానాల రెక్కలు, విమానాల తయారీకి అవసరం అయ్యే ఇతర విడి భాగాలు ఇప్పటికే హైదరాబాద్ శివార్లలో ఉన్న కంపెనీల్లో తయారు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే విమానాల ఇంజన్ లను సైతం తయారు చేస్తూ పూర్తి విమానాల తయారీకి హైదరాబాద్ ను హబ్ గా మార్చాలనే ఆలోచనలో రాష్ట్ర సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది.
అందుకోసం ఇప్పటికే రెండు కంపెనీలు రాగా రూ.5 కోట్ల పెట్టు బడులతో మరో ఆరు కంపెనీలు రాబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే హైదరాబాద్ ఇప్పటికే ఫార్మా హబ్ గా మారిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఐటి రంగంలోనూ హైదరాబాద్ దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు విమానాల తయారీ కి హబ్ గా మారితే రాష్ట్రం లో ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా హైదరాబాద్ కు గుర్తింపు రానుంది.